వేదింపులు తాళలేక 9 తరగతి విద్యార్థిని ఆత్మహత్య – అండగా జనసేన

విజయవాడ, అభం శుభం తెలియని 13 ఏళ్ల చిన్నారి దీక్షిత పై టీడీపీ 37 వ డివిజన్ ఇంచార్జ్ వినోద్ జైన్ 2 నెలలు నుంచి లైంగిక వేధింపులకు గురి చేస్తుండడంతో వాడి బాధ తట్టుకోలేక దీక్షిత ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వారి కుటుంబ సభ్యులను జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ పరామర్శించారు. ఈ సందర్బంగా పోతిన మహేష్ మాట్లాడుతూ మరణించిన దీక్షిత తల్లిదండ్రులు ఆవేదన వర్ణనాతీతం అని, అధ్యాపకురాలు అయినా దీక్షిత తల్లి తన కూతుర్ని కాపాడుకోలేక పోయానని అనటం ఘోరం అని, ఈ కష్టం దారుణం మరెవ్వరికీ జరగకూడదని అన్నారు. వినోద్ జైన్ కు కఠినమైన శిక్ష పడే అంతవరకూ పోరాడాలని, అందుకు అండగా నిలబడాలని మహేష్ ని కోరడం జరిగింది. వారికి మహేష్ నిందితుడికి శిక్ష పడేవరకు జనసేన పార్టీ అండగా ఉంటుందని హామీ ఇవ్వడం జరిగింది.