అవనిగడ్డలో జనం కోసం జనసేన 9వ రోజు

అవనిగడ్డ: జనసేన పార్టీ టౌన్ అధ్యక్షులు రాజనాల వీరబాబు ఆధ్వర్యంలో అవనిగడ్డ లోని రెండో వార్డు సుగాలి కాలనీలో నిర్వహించడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఏ ఆశయ సాధన కోసమైతే జనసేన పార్టీని స్థాపించారో.. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఆశయాలను, జనసేన సిద్దంతాలనూ ప్రజలకు వివరిస్తూ స్థానిక ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలు తెలుసుకొని జనసేన పార్టీ ఆవశ్యకతను, క్రియాశీలక సభ్యత్వ ఆవశ్యకతను తెలియజేయడం జరిగింది. ఈ కార్యమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడటమే తమ లక్ష్యమని ప్రజలు వివరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉపాధ్యక్షులు ఆళ్ళమళ్ళ చందు బాబు, అవనిగడ్డ గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి అన్నపరెడ్డి ఏసుబాబు, ముఖ్య అతిథులుగా అవనిగడ్డ మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బచ్చు శ్రీహరి, మరియు మరొక అవనిగడ్డ మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి భోగిరెడ్డి నాగేశ్వరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ జనసేన పార్టీ టౌన్ కమిటీ సభ్యులు మరియు వీరమహిళలు, జనసేన పార్టీ నాయకులు విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.