ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో కొటికలపూడి గోవిందరాజు పుట్టినరోజు వేడుకలు
ఏలూరు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ ఇంచార్జ్, భీమవరం నియోజవర్గం ఇంచార్జ్ కొటికలపూడి గోవిందరాజు పుట్టినరోజు వేడుకలు ఏలూరు నియోజకవర్గం ఇంచార్జ్, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల అధికార ప్రతినిధి రెడ్డిఅప్పలనాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ.. గోవిందరాజు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని, ఆయన మరింత అభివృద్ధి చెందాలని, ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని కార్యకర్తలందరూ జనసేన పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జనసేన పార్టీ ఏలూరు నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, వీరంకి పండు, రెడ్డి గౌరీ, బొండా రాము నాయుడు, బోత్స మధు, కందుకూరి ఈశ్వరరావు, వేముల బాలు, ఏట్రెంచి ధర్మేంద్ర, బెజవాడ నాగభూషణ కుమార్, సరిది రాజేష్, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-24-at-5.27.41-PM-1024x768.jpeg)