రైతుల సమస్యలపై పోరాటానికి జనసేన సిద్ధం

అవనిగడ్డ నియోజకవర్గం: రైతులు పండించే ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తేమ పేరుతో అడ్డగోలుగా ధరల కోత విధించడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ విషయంపై కృష్ణా జిల్లా, చల్లపల్లి మండలం, నూకలవారిపాలెం గ్రామంలో జనసేన నాయకులు రైతులను కలిసి ధాన్యం రాశులను పరిశీలించడం జరిగింది.. ఈ సందర్బంగా చల్లపల్లి మండల అధ్యక్షులు చోడగం విమల్ కృష్ణా మాట్లాడుతూ ధాన్యం కోనుగోలు విషయంలో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.. గత సంవత్సరం ధాన్యాన్ని కోనుగోలు చేసిన ప్రభుత్వం ఈ సంవత్సరం తేమ శాతం అనే వంకతో రైతు దగ్గర నుండి ధాన్యం కోనుగోలు చెయ్యకపోవడం బాధాకరమైన విషయం.. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం తేమ శాతం పేరుతో ధరల కోత విధించడం, అలాగే రైతులు ధాన్యం ఆరబోయడంలో పరదాల అద్దె, కూలీలతో రైతుల మీద అదనపు భారం పడుతుంది.. దానికి తోడు ప్రతికూల వాతావరణం, వాయుగుండాలతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు అని అన్నారు..ఈ సమస్యపై జనసేన పార్టీ రైతులతో కలిసి ఉద్యమానికి కూడా సిద్ధంగా ఉన్నాం అని అన్నారు.. ఇప్పడికైనా ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రైతులతో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం అని అన్నారు.. ఈ కార్యక్రమంలో నూకల లక్ష్మయ్య, శేఘు, పుల్లయ్య బాబు, నారాయణ, నూకల ఉదయ్ భాస్కర్, జనసేన పార్టీ కృష్ణా జిల్లా సంయుక్త కార్యదర్శి ఉస్మాన్ షరీఫ్, మండల ప్రధాన కార్యదర్శి తోట మురళి కృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి మిరియాల జితేంద్ర, జనసేన పార్టీ అవనిగడ్డ ఐటీ కోఆర్డినేటర్ సూదాని నందగోపాల్, సుంకర శివయ్య, నీలకంఠి రవితేజ, తోట శివ సందేష్, నీలకంఠి రంజిత్, కూరేటి రాఘవ, స్థానిక రైతులు పాల్గొన్నారు..