అవనిగడ్డ ప్రధాన సమస్యలపై తాసిల్దార్ కు జనసేన వినతి పత్రం

అవనిగడ్డ టౌన్ జనసేన పార్టీ అధ్యక్షులు రాజనాల వీరబాబు ఆధ్వర్యంలో సోమవారం అవనిగడ్డ లోని ప్రధాన సమస్యలుగా ఉన్న అంతర్గత డ్రైనేజీలు మరియు మెయిన్ డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళన చేయాలని లేదా పునరుద్ధరీకరించాలని, అలాగే అవనిగడ్డలో ప్రధాన సమస్యగా ఉన్న డంపింగ్ యార్డ్ మార్పిడి సమస్యని తీర్చాలని, మరియు అవనిగడ్డ నుండి పాత ఎడ్లంక కి వెళ్లే కృష్ణానది పాయ మీద ఉన్నటువంటి శాశ్వత వంతెన నిర్మాణాన్ని చేపట్టాలని వీటి పరిష్కారం కోసం గత ఏడు నెలల క్రితం అవనిగడ్డ పర్యటనకి వచ్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు గారి కోరిక మేరకు నిధులు శాంక్షన్ చేశామని బహిరంగ సభలో తెలియజేయడం జరిగింది కానీ ఇప్పటివరకూ ఆ పనులు ప్రారంభించకపోవడం చాలా బాధాకరం. దీన్ని మా జనసేన పార్టీ ద్వారా తీవ్రంగా ఖండిస్తూ వెంటనే ఈ సమస్యల పరిష్కారానికి పనులు ప్రారంభించాలని కోరుతూ ఎమ్మార్వో గారిని కలిసి వినతిపత్రం అందించడం జరిగింది. అలా చేయని పక్షంలో మా జనసేన పార్టీ ద్వారా ప్రజా ఉద్యమం చేసి ఆ సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ టౌన్జనసేన, పార్టీ అధ్యక్షులు రాజనాల వీరబాబు, అవనిగడ్డ టౌన్ జనసేన పార్టీ ఉపాధ్యక్షురాలు భోగాది రాజ్యలక్ష్మి, అవనిగడ్డ టౌన్ పార్టీ ఉపాధ్యక్షులు ఆళ్లమళ్ల చందు, అవనిగడ్డ టౌన్ పార్టీ ఉపాధ్యక్షులు గుగులోతు కిరణ్ నాయక్, అవనిగడ్డ టౌన్ పార్టీ ప్రధాన కార్యదర్శి అన్నపురెడ్డి ఏసుబాబు, అవనిగడ్డ టౌన్ పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ ఫరీద్ బాబా, కార్యదర్శి తోట ప్రసాద్, నెరసు అశోక్, కే లక్ష్మీ, అలాగే అవనిగడ్డ మండల జనసేన పార్టీ కార్యదర్శి ఆర్యవైశ్య నాయకులు గుగ్గిలం అనిల్ కుమార్ ఎంపీటీసీ బొప్పన భాను, జనసేన పార్టీ సీనియర్ నాయకులు మత్తి సుబ్రమణ్యం మరియు తదితర జనసైనికులు పాల్గొన్నారు.