పాల్వంచ పట్టణంలో జనసేనాని పుట్టినరోజు వేడుకలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండలం, పాల్వంచ పట్టణంలో శనివారం జనసేన పార్టీ అధ్యక్షులు సినీ రంగంలో అత్యంత అభిమానులు కలిగినటువంటి పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా, నవభారత్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వారు ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలు కలిగి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన సీఎం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అనంతరం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి నందు, పాల్వంచ మండల కమిటీ నాయకులు ఓలపల్లి రాంబాబు,మరియు మెగా అభిమానుల అధ్యక్షుడు ఖాసీం, మరియు అభిమాని కీర్తి సింహాచలం, జనసేన నాయకులు ఆధ్వర్యంలో నిరుపేద దివ్యాంగులకు నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్వంచ పట్టణ ఎస్ఐ రాము, మరియు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండేంట్ డాక్టర్ ముక్కంటేశ్వరరావు మరియు డాక్టర్ కిరణ్ కుమార్, మరియు డాక్టర్ సింధు, వీరందరి చేతుల మీదగా, కేక్ కట్ చేసి అనంతరం దివ్యాంగులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి, ముఖ్య అతిథి పాల్వంచ టౌన్ ఎస్ఐ రాము మరియు డాక్టర్ ముక్కంటిశ్వరరావు, పాల్వంచ మండల అధ్యక్షుడు ఓలపల్లి రాంబాబు, జి బోసు బాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలిగి ఉండాలని ఇలాంటి సేవలు మరెన్నో చేయాలని కోరుతూ ప్రసంగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, వైస్ ప్రెసిడెంట్ సంపత్ వర్మ వీరబ్రహ్మం, షేక్ బాషా, బాలాజీ, భోగి లక్ష్మయ్య, భాస్కర్, రహీం, మౌలా, సిద్దు, ముఖ్య నాయకులు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు, మెగా అభిమానులు తదితరులు పాల్గొన్నారు.