జగనన్నా మా స్థలాలు ఎక్కడ..?: డాక్టర్ పిల్లా శ్రీధర్

  • పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ ఆధ్వర్యంలో ధర్నా

పిఠాపురం నియోజకవర్గం: పిఠాపురం మున్సిపాలిటీ పరిధి మరియు పిఠాపురం మండలంలోని పలు గ్రామాలకు సంబంధించి సుమారు 5000 మంది లబ్ధిదారులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చారు తప్ప ఇళ్ల స్థలాలను లబ్ధిదారులకు నేటికీ చూపించలేదని పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ ఆధ్వర్యంలో పిఠాపురం మున్సిపాలిటీ మరియు పిఠాపురం మండలంలోని పలు గ్రామాల ప్రజలకు కేటాయించామని చెబుతున్న పిఠాపురం పట్టణానికి సమీపమున విరవాడ రోడ్డులో గల లేఅవుట్లో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు వెంటనే అప్పగించాలని డిమాండ్ తో.. జగనన్న కేటాయించిన ఇళ్ల స్థలాల మధ్యలో జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ బైఠాయించారు. అనంతరం డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం మున్సిపాలిటీ పరిధి మరియు పిఠాపురం మండలంలోని పలు గ్రామాలకు సంబంధించి సుమారు 5000 మంది లబ్ధిదారులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చారు తప్ప ఇళ్ల స్థలాలను లబ్ధిదారులకు నేటికీ చూపించలేదని, పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు వెంటనే అప్పగించాలని ఈ వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని, సంబంధిత అధికారులకు రిప్రజెంటేషన్ కూడా ఇస్తామని గ్రీవెన్స్ సెల్ లో కూడా వినతిపత్రం అందిస్తామన్నట్లు డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియా ముందు వాపోయారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మత్స్యకర నాయకులు కంబాల దాసు, కూరాకుల వీరబాబు, జవ్వదుల గోవిందు, మైనం నాగేశ్వరావు, దిబ్బిడి కృష్ణ, ఎర్ర గంగాధర్, సి.హెచ్ శ్రీను, ఎక్స్ సర్పంచ్ గరగా సత్యం వంకా కొండ బాబు, గేదెల వెంకటరావు, బొజ్జ గోపి కృష్ణ, దుడ్డు రాంబాబు, మచ్చ శ్రీనివాసరావు, వీరాంరెడ్డి అమర్, పల్నాటి మధు బాబు, కోన రామకృష్ణ, మిరియాల అర్జున్, శ్రీపతి సుబ్రహ్మణ్యం, కారణం హరీషకుమార్, నర్ల విష్ణు, నంద్యాల నాగబాబు, బొజ్జ బుల్లిరాజు, సోడిశెట్టి లక్ష్మణరావు, వూట శ్రీనివాసరావు, రుద్రారపు శ్రీను, మచ్చ రాజుబాబు, కీర్తి చంటి, సోదే శ్రీను, చోడిపల్లి శ్రీని, చొక్కా చిన్న, చింతకాయల పూరి, కొండపల్లి శివ, కొల్లా చంటి, కేసిరెడ్డి బుల్లి రాజు, సైతన బుల్లి వెంకట రాజు, జీను శ్రీను, కాపురపు వెంకటేష్, గుర్రం గణేష్, కొత్తపల్లి రాజు, మెరుగు రవి, వీరబాబు, మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.