మూడవ విడత పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా

నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ప్రజల సమస్యలు అధ్యయనం చేసేందుకు, జనసేన పార్టీ సిద్ధాంతాలను బలపరచడం కోసం వంగ లక్ష్మణ్ గౌడ్ తలపెట్టిన కార్యక్రమం పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా పాదయాత్ర మొదటి విడత తెల్కపల్లి మండలం, రెండో విడతగా బిజినపల్లి మండలంలో విజయవంతంగా పూర్తి చేసుకొని మూడో విడతగా తిమ్మాజిపెట మండలంలో 26వ రోజుగా శుక్రవారం ఆర్ సి తాండాలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ, మండల, నాయకులు జనసైనికులతో కలిసి వంగ లక్ష్మణ్ గౌడ్ ఆర్.సి తాండాలో పర్యటించారు. జనసేన పార్టీ పట్ల తాండా వాసుల అపూర్వ ఆదరణ, పొందుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించారు.

తాండాలోని ప్రజల ప్రధాన సమస్యలు
• రైతులకు రుణమాఫీ లేదు.
• పత్తికి ధర లేక భారీగా నష్టపోతున్న రైతులు.

కేసీఆర్ ఏమో దేశాన్ని ఉద్ధరిస్తానని అంటాడు, తెలంగాణలో రైతులను పట్టించుకోని నీవు దేశానికి ఏమి చేస్తావు అంటూ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మా వంతుగా కరీంనగర్ నుంచి కదిలి మేము సైతం అంటూ లక్ష్మణ్ గౌడ్ పాదయాత్రలో కరింనగర్ జిల్లా నాయకులు చల్ల శివరెడ్డి, గగన్, పవన్ పాదం కలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ నాయకులు గోపాస్ కుర్మన్న, శ్రీనివాస్ నాయక్, సూర్య, వంశీ రెడ్డి, బోనాసి లక్ష్మణ్, ప్రసాద్, పుస శివ, రాకేష్, బోనాసి దేవేందర్, బోనాసి రాజు, ఎస్ శ్రీనివాస్, నరేందర్, గణేష్, బాషా, గోవర్ధన్, పవన్ కుమార్, నాగేష్ పవన్, బాల్ రామ్, రాఖీ తదితరులు పాల్గొన్నారు.