కొవ్వూరు జనసేన కార్యవర్గ సమావేశం

  • జనవాణి ద్వారా జనసేనాని దృష్టికి కొవ్వూరు సమస్యలు

కొవ్వూరు నియోజకవర్గం: కొవ్వూరులో జనసైనికులు, నాయకులు కలిసి ఏర్పాటు చేసుకున్న నూతన జనసేన కార్యాలయంలో ఆదివారం సీనియర్ జనసేన నాయకులు పుప్పాల సత్యనారాయణ, సీనియర్ నాయకులు కొప్పాక విజయ్ కుమార్, తోర్లపాటి షితాల్, రాఘవులు సమావేశమై కొవ్వూరు నియోజకవర్గంలోని ప్రధానసమస్యలపై చర్చించి, వాటిని జనవాణి ద్వారా శ్రీ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళేందుకు నిర్ణయించుకున్నారు.