నెల్లిమర్ల సమస్యలపై భారీ జనసమూహంతో లోకం మాధవి నిరసన ర్యాలి

నెల్లిమర్ల నియోజకవర్గం: నెల్లిమర్ల మండలంలో నెల్లిమర్ల జనసేన నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి లోకం మాధవి ఆధ్వర్యంలో నెల్లిమర్ల మిమ్స్ హాస్పిటల్ నుండి మొదలుకొని మోహిదా జంక్షన్ వరకు నెల్లిమర్ల నియోజకవర్గంలోని ప్రజలు గత నాలుగు ఏళ్లగా ఎదుర్కొంటున్న సమస్యలపై భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో నాలుగు మండలాలకు చెందిన జనసైనికులు, వీరమహిళలు మరియు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా గత నాలుగేళ్లగా ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు అయిన
మద్యపాన నిషేధం, భోగాపురం మండలంలోని పరిష్కారానికి నోచుకోని బట్టి కాలువ సమస్య, గత ఏడాది నుండి పరిష్కారం కానీ ముంజేరు సిద్ధార్థ కాలనీ మురికి నీటి సమస్య, పరిష్కారానికి నోచుకోని చోడిపిల్లి పేట రహదారి సమస్య, చాకివలస గ్రామ ప్రజల ఫ్లోరైడ్ సమస్య, ముక్కాం ప్రజల తాగునీటి సమస్య, భోగాపురం మండలం రామచంద్ర పేట గ్రామంలో యదేచ్ఛగా సాగుతున్న మైనింగ్ మాఫియా, ఆర్ అండ్ ఆర్ జరిగిన అవకతవకలతో ఇబ్బంది పడుతున్న భోగాపురం భూ నిర్వాసితుల సమస్య, చేపల కంచర గ్రామంలోని ఇళ్ల పట్టాల కంపెనీలో అవకతవకలు, ఫార్మా కంపెనీల వ్యర్థల వల్ల నాశనం అవుతున్న మత్స్య సంపద వాగ్దానాలకే పరిమితమైన జట్టి నిర్మాణం, గుణుపూరుపేట డంపింగ్ యార్డ్ సమస్య, రామతీర్థ సాగర్ ప్రాజెక్టు ఇలా మొదలగు సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మొదలు పెట్టినటువంటి ఈ నిరసన ర్యాలీకి సామాన్య ప్రజల నుండి మంచి స్పందన లభించింది. ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్న ప్రజలు మాట్లాడుతూ గత నాలుగేళ్లగా నియోజకవర్గంలోని అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే లా ఉందని, రెండుసార్లు శాసనసభ్యుడిగా గెలిచినటువంటి బొడ్డు కొండా అప్పలనాయుడు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని, ఒక్క ఛాన్స్ ఇచ్చి నమ్మి మోసపోయామని, ఈసారి అటువంటి పరిస్థితి ఉండబోదని, రాష్ట్రంలోని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ఆయన చేస్తున్న పోరాటాలు కౌలు రైతుకి ఆయన అందించినటువంటి సహాయ సహకారం అలాగే స్థానికంగా ఉన్నటువంటి శ్రీమతి మాధవి గారి నాయకత్వం తాము కోరుకుంటున్నట్టు ప్రజలు తెలియజేశారు. మాధవి గారు లాంటి నాయకురాలు వస్తే మాలాంటి ఆడవారికి సహాయ సహకారాలు అందిస్తారన్న నమ్మకం తమకి ఉందని నిరసన ర్యాలీలో పాల్గొన్న మహిళలు తెలియజేశారు. సుమారు ఈ ర్యాలీ రెండు గంటలు కొనసాగింది, ఇందులో సుమారుగా 3000 మంది ప్రజలు పాల్గొన్నారు. మొయిదా జంక్షన్ తో ముగిసిన ఈ ర్యాలీ అనంతరం లోకం మాధవి గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. లోకం మాధవి గారు మాట్లాడుతూ గత నాలుగేళ్లగా నియోజకవర్గంలోని ప్రజల గోడుని వినే నాయకులు లేరని, నాయకుడు అనే వాడు తన స్వార్థ ప్రయోజనాలను విడిచిపెట్టి ప్రజలకి స్థిరమైన ఆదాయం ఉండేలా చర్యలు తీసుకోవాలి కానీ, వచ్చే పరిశ్రమలని కూడా అడ్డుకొని వాటాలు ఇవ్వమని నాయకులు మనకి అవసరమా అని ప్రశ్నించారు, ఇళ్ల పట్టాల విషయంలో ఎంతో జాప్యం జరిగిందని వీటిపై మా పోరాటం ఎప్పుడు ఆగదని పేదవాడి ఇంటికలే తమలక్ష్యమని మరియు మా అధినాయకుడి ఆలోచన అని మాధవి గారు తెలియజేశారు. తామాధికారంలోకి వస్తే నెల్లిమర్ల నియోజకవర్గం ని ఒక్క మహానగరంగా తీర్చిదిద్దటానికి తాను కంకణం కట్టుకున్నానని, వచ్చే భావితరాల భవిష్యత్తు తన లక్ష్యం అని మాధువి గారు పేర్కొన్నారు. ఈ నిరసన ర్యాలీని ఇంత విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి తన ధన్యవాదాలు తెలియజేసారు.