రైల్వే అండర్ పాస్ నిర్మాణం కోసం జనసేన వినతి పత్రం

ఇచ్చాపురం నియోజకవర్గం: ఇచ్చాపురం మున్సిపాలిటీలో ఇచ్చాపురం నుండి కొలిగాంకి వెళ్లే రహదారిలో రైల్వే అండర్ పాస్ కోసం గతంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేసినప్పుడు జనసేన నాయకులకు డి.ఆర్.ఎం ను కలవడానికి అపాయింట్మెంట్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ నేపధ్యంలో సోమవారం వారికి కలవడానికి పర్మిషన్ రాగా డి.ఆర్.ఎం రింకేష్ రాయ్ ను మర్యాదపూర్వకంగా కలిసి రైల్వే అండర్ పాస్ కోసం వినతి పత్రం అందజేసారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన డి.ఆర్.ఎం ఇచ్చాపురంకి సంబంధిత ఇంజినీర్ డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించి పర్యవేక్షిస్తారని తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రెటరీ బైపల్లి ఈశ్వరరావు, హరి బెహరా, డొక్కరి ఈశ్వరరావు, శ్రీ సత్యసాయి రెసిడెన్షియల్ స్కూల్ డైరెక్టర్ కృష్ణమూర్తి మరియు దివాకర్ రమణారావు తదితరులు కలవడం జరిగినది.