భారీ వర్షానికి సైతం చెక్కుచెదరని సంకల్పబలం జనసైనికుల సొంతం

  • గిరిజన సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జనసేన
  • జి.మాడుగుల మండల కేంద్రం నుంచి సంతబయలు వరకు భారీ ర్యాలీ

పాడేరు నియోజకవర్గం: జి.మాడుగుల మండలంలో భారీ వర్షానికి సైతం చెక్కుచెదరని సంకల్పబలంతో జనసైనికులు, జనసేన ఆధ్వర్యంలో పాడేరు నియోజకవర్గ జనసేన పార్టీ తరుపున గిరిజన సమస్యలపై ప్రభుత్వాన్ని కరపత్రంతో ప్రశ్నించే విదంగా జి.మాడుగుల మండల కేంద్రం నుంచి సంతబయలు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జనసైనికులు మరియు జనసేన పార్టీ నాయకులు గత మూడు రోజుల నుంచి డా. వంపూరు గంగులయ్య అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్చార్జ్ ఆదేశాల మేరకు మండల నాయకులు గ్రామ పర్యటన చేస్తూ వాస్తవ రాజకీయ ద్వంద విధానాలపై, గిరిజన వ్యతిరేక విధానాలపై ప్రజలకు చైతన్య పరుస్తూ ఈ రోజు భారీ ర్యాలీ నిర్వహించారు. ఒక వైపు ఎడతెరిపిలేని వర్షం పడుతుండగా ఇంకోవైపు ఉరకలు వేసే ఉత్సహంతో జై పవన్ కళ్యాణ్, జై గంగులయ్య అంటూ నినాదాలు చేస్తూ ప్రస్తుత రాష్ట్ర పరిస్థితిపై వ్యంగ్యంగా పాలన అంటే ఇదేనా? వైసీపీ ప్రభుత్వ తీరు ఇదేనా అంటూ సూటిగా ప్రశ్నించారు. ఆద్యంతం మండలంలో నుర్మతి జంక్షన్ నుంచి మొదలు కొని సంతబయలు వరకు బైక్స్, ఆటో రిక్షా ర్యాలీ చేస్తూ జగన్ పోవాలి, పవన్ రావాలి.. వారాహి వచ్చే వైసీపీ పోయే అంటూ.. నినదిస్తూ సంత ప్రధాన కూడలిలో గిరిజన ప్రజలనుద్దేశించి మండల నాయకులు ప్రసంగించారు. ఈ ర్యాలీలో మాట్లాడిన జనసేన పార్టీ ఇన్చార్జ్ ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శించారు. యువతలో ఎంత వ్యతిరేకత లేకపోతే ఒక ప్రభుత్వ విధానాలపై ఇంతటి ద్వేషం పెంచుకుంటారు. గిరిజన ప్రజాప్రతినిధులు ఈ తరానికి బానిసత్వం సంపదగా ఇద్దమనుకుంటున్నారా? మా గిరిజన జాతిపైన మీకున్న శిత్తశుద్ధి కారణంగా జివో నెం3 కోల్పోయాం, గిరిజన హక్కులు కోల్పోయాం. ఇంకా చివరికి మీ చేతగాని తనం వల్ల నేడు గిరిజన అస్తిత్వం కోల్పోయే పరిస్థితికొచ్చేసాం. మీ నాయకత్వ తీరు ఇలావుంది అంటూ ఎద్దేవా చేశారు. ఈ ర్యాలీ విజయవంతానికి శక్తివంచన లేకుండా కృషి చేసిన జి.మాడుగుల మండల అధ్యక్షులు మసాడి భీమన్న, లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్, కార్యనిర్వహన అధ్యక్షులు తాంగుల రమేష్, తల్లే త్రిమూర్తి, మండల నాయకులు కొర్ర భానుప్రసాద్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ర్యాలీలో ప్రధాన కార్యదర్శి గొంది మురళి, మస్తాన్, పవన్ కళ్యాణ్, పాడేరు మండల అధ్యక్షులు నందోలి మురళీకృష్ణ, అశోక్, చింతపల్లి మండల నాయకులు బుజ్జిబాబు, ఫునిత్, స్వామి తదితర ముఖ్యనాయకులు, అశేష సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు.