జగన్నాథపురం, సూదికొండ గ్రామాలలో జనం కోసం జనసేన

  • జనం కోసం జనసేన 594వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: జనసేన నాయకులు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనం కోసం జనసేన 594వ రోజు కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం గోకవరం మండలం, జగన్నాథపురం మరియు సూదికొండ గ్రామాలలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 600 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 98210 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 595వ రోజు కార్యక్రమాన్ని బుధవారం జగ్గంపేట మండలం, గోవిందపురం గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవి తెలిపారు. మంగళవారం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి గండికోట వీరపాండు, కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు, జగన్నాథపురం నుండి కింతాడ సింధు రాజ్, కుక్కా పవన్ కుమార్, బొందల ప్రసాద్, అమరపల్లి రామకృష్ణ, నాగులపల్లి వీరబాబు, సూదికొండ నుండి వెడుళ్ళ వీరబాబు, నూకతట్టు సుందరమ్మ, జె.కొత్తూరు నుండి గ్రామ అధ్యక్షులు గుంటముక్కల మధు, గోనేడ నుండి నల్లంసెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, జానకి మంగరాజు లకు మరియు జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా సీతానగరం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన సింగం శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు పాటంశెట్టి శ్రీదేవి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.