యువశక్తితోనే జగనాసుర పాలన అంతం: నేరేళ్ళ సురేష్

గుంటూరు: రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి ఎప్పుడైతే ప్రమాణస్వీకారం చేశారో ఆ క్షణం నుంచి రాష్ట్ర ప్రజల జీవితాలు త్రిశంఖు స్వర్గంగా మారాయని, చైతన్యం కలిగిన యువత ద్వారానే ఈ జగణాసుర పాలన అంతమవుతుందని జనసేన పార్టీ గుంటూరు అర్బన్ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. ఆదివారం నగర పార్టీ కార్యాలయంలో నల్లచెరువు ప్రాంతం నుంచి పెద్దఎత్తున యువకులు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ మూడున్నరేళ్లుగా రాష్ట్రంలో కొనసాగుతున్న వైసీపీ అరాచక పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు. అధికారంలోకి రాకముందు అన్ని వర్గాల ప్రజలకు అలవికాని హామీలిచ్చి ఇప్పుడు ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. వ్యాపారులు, ఉద్యోగులు, పేద, మధ్యతరగతి ప్రజలు ఎవరూ కూడా ఈ ప్రభుత్వంలో సుఖంగా లేరని విమర్శించారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి అంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ తోనే సాధ్యమన్నారు. జనసేన పార్టీ సిద్దాంతాలు, పవన్ కళ్యాణ్ నిజాయితీ, నిబద్ధత పట్ల ప్రజలు ఆకర్షితులు అవుతున్నారన్నారు. పవన్ కళ్యాణ్ కు ఒక అవకాశం ఇవ్వాలన్న నిర్ణయానికి ప్రజలు వచ్చారని, రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని నేరేళ్ళ సురేష్ అన్నారు. ఈ సందర్భంగా 19 వ డివిజన్ కి సంభందించిన పానకాల లక్ష్మణ్, పానకాల శంకర్, శ్రీనివాస్ తదితరులకు నేరేళ్ళ సురేష్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, నగర ప్రధాన కార్యదర్శి చింతా రాజు, కార్యదర్శిలు బండారు రవీంద్ర, నాగేంద్ర సింగ్, పుల్లంసెట్టి ఉదయ్ , రెల్లి నాయకుడు సోమి ఉదయ్, 20 వ డీవిజన్ అధ్యక్షుడు బాలకృష్ణ, వీరమహిళ మాధవి తదితరులు పాల్గొన్నారు.