జనసేన క్రియాశీలక సభ్యత్వం ప్రతి జనసైనికుడు కుటుంబానికి ఒక భరోసా: గాదె

ప్రత్తిపాడు నియోజకవర్గం: గుంటూరు రూరల్ మండలం, చల్లవారిపాలెం గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరు జనసేన పార్టీ విధివిధానాల్ని, జనసేన పార్టీ మేనిఫెస్టోని ప్రజలకు బలంగా తీసుకెళ్లడం వారి బాధ్యత అని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, నారదాసు రామచంద్ర ప్రసాద్, ఉప్పు రత్తయ్య, చట్టాల త్రినాథ్, కొర్రపాటి నాగేశ్వరావు, కార్పొరేటర్ దాసరి లక్ష్మీ దుర్గ, మండల అధ్యక్షులు గంధం సురేష్, గ్రామ అధ్యక్షులు సుధా పిచ్చయ్య, సభ్యత నమోదు వాలంటీర్ లీలా కుమార్, మరియు మండల నాయకులు, గ్రామ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.