అగ్ని ప్రమాద బాధితులకు జనసేన చేయూత

పోలవరం నియోజకవర్గం: అశ్వారావుపేట మండలం, గుర్రాల చెరువు గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడి గొర్రెల కాపరి సంకుల సత్యం పూరి గుడిసె దగ్ధం కాగా, సర్వం కోల్పోయి కట్టు బట్టలతో మిగిలారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ అశ్వరావుపేట నియోజకవర్గం ఇంచార్జ్ డేగల రామచంద్రరావు ఆధ్వర్యంలో బాధితులకు నెలకు సరిపడా నిత్యవసర సరుకులు, కూరగాయలు 4 వేల రూపాయల నగదును అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఇస్లావత్ వినోద్ కుమార్ దామర అయ్యప్ప(బాబి), లింగిశెట్టి కుమార్ స్వామి, పాలడుగుల రమేష్, మంగదొడ్డి సాయి, బద్దిరెడ్డి రాజేష్ మౌళి తదితరులు పాల్గొన్నారు.