వెల్ఫేర్ అసిస్టెంట్ పై దాడి అమానుషం

అధికార పార్టీ నాయకుల చర్యలను ఖండిస్తున్నాను.
చట్టాన్ని అతిక్రమించి వారిచేత పనులు చేయిస్తే సహించబోము. ఉద్యోగస్తులకు అండగా జనసేన.
గౌరవ అధ్యక్షులు లోకనాథం నాయుడు.

పెనుమూరు మండలం చర్వ గాని పల్లి పంచాయతీ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న సుబ్బరాజును స్థానిక అధికార పార్టీ నాయకుడు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని జనసేన పార్టీ జిల్లా గౌరవ అధ్యక్షులు లోకనాథం నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాన్ని అతిక్రమించి వారి చేత పనులు చేయిస్తే సహించబోమని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. మండలంలోని ఉద్యోగస్తులకు జనసేన అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలి, చట్ట ప్రకారమే పనులు చేసుకోవాలని తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో సమస్యలను పరిష్కరించుకోవాలి గానీ పరిధి దాటి ప్రవర్తించటం మంచిది కాదని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు నిరసన తెలిపిన ఉద్యోగస్తులకు సంఘీభావంగా లోకనాథం నాయుడు వారిని పరామర్శించారు. భవిష్యత్తులో మీకు అండగా ఉంటామని, ఎవరు ఆ ధైర్యం చెందవద్దని, చట్టపరిధిలో నే పని చేసుకుంటూ వెళ్లండి అని తెలియజేశారు.