పవన్ కళ్యాణ్ ను కలిసిన పిసిని చంద్రమోహన్

మంగళగిరి: జనసేన పార్టీ అధ్యక్షులు కొనెదల పవన్ కళ్యాణ్ ను మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాల్యంలో మర్యాదపూర్వకంగా (ఏఐటికెఎస్ఎస్) ఆలిండియా తూర్పుకాపు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు మరియు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు పిసిని చంద్రమోహన్ కలుసుకున్నారు. ఈ నేపథ్యంలో తూర్పుకాపుజాతి ఎదుర్కొంటున్న ప్రధానమైన అనేక సమస్యలపై మరోసారి సమీక్షా సమావేశంలో మాట్లాడటం జరిగింది. ఈ కలయకలో ఉత్తరాంధ్రకు చెందిన అనేక మంది మేధావులు, ప్రజాసంఘాల నేతలు, ఆయా రాజకీయ పార్టీలలో పనిచేస్తున్న కొందరు నేతలను జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో సమావేశపరిచి వారిని పార్టీలోకి ఆహ్వానించటం జరిగింది. అనంతరం అనేక అంశాలపై సుధీర్గమైన చర్చ జరిగింది. ఈ సందర్బంగా జనసేన పార్టీ చేపట్టబోయే ముడవ దశ వారాహి విజయ యాత్ర ఈ నెల 10 నుంచి విశాఖపట్నం జిల్లాలో పునప్రారంభం కాబోతున్న సమయంలో ఉత్తరాంధ్రా నుంచి అనేక చేరికలు ఉంటాయని సూచించారు. ఈ సందర్బంగా ముందుగా జనసేన పార్టీ పీఏసీ రాష్ట్ర చైర్మన్ నాదెండ్ల మనోహర్ అనేక ప్రజా సమస్యలపై మాట్లాడిన అనంతపురం పలువురు నేతలను వారి సమక్షంలో జనసేన పార్టీలో చేర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ముఖ్య నేతలు తమ్మిశెట్టి శివశంకర్, బొలిశెట్టి శ్రీనివాసరావు, హరహం ఖాన్, ఏ.పి.టి.కె.జె.ఎ.సి రాష్ట్ర చైర్మన్ గిరడా అప్పలస్వామి, గుంటూరు జిల్లా, కృష్ణాజిల్లాల అధ్యక్షులు, మరియు అనేక మంది పార్టీ పెద్దలను కలుసుకున్నాము, అని పిసిని చంద్రమోహన్ మీడియాకి తెలియజేసారు.