దళిత సర్పంచ్ మాశయ్యపై దాడి చేసిన ఎస్సైని సస్పెండ్ చేయాలి

  • కొల్లాపూర్ నియోజకవర్గ జనసేన కో-ఆర్డినేటర్ భైరపోగు సాంబశివుడు

కొల్లాపూర్ నియోజకవర్గం: ఇటీవలి కాలంలో మైలారం గ్రామ సర్పంచ్ మాశయ్యపై కోడెర్ ఎస్సై శేఖర్ రెడ్డి చేసిన దాడికి నిరసనగా శనివారం కొల్లాపూర్ పట్టణంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో జనసేన పార్టీ కొల్లాపూర్ నియోజకవర్గం కో-ఆర్డినేటర్ భైరపోగు సాంబశివుడు పాల్గొని సంఘీభావం తెలిపారు. సంఘీభావం తెలుపుతూ అనంతరం ఆయన మాట్లాడుతూ.. సర్పంచ్ మసయ్యపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి ఘటనలు కొల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో గత కొన్ని రోజులుగా స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చినప్పటి నుంచి దళితులపైన ప్రశ్నించే గొంతుకలపై, విలేకరులపై, ఇసుక దందాను వ్యతిరేకిస్తున్న సామాన్యుల మీద దాడులు చేస్తున్న వైనం చాలా దారుణమని ఇలాంటి ప్రజాప్రతినిధులు ఉన్నంతకాలం దాడులు కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి ఓటు రూపంలో చైతన్యమై రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా ఆలోచించే వ్యక్తులను వచ్చే ఎన్నికలలో గెలిపించి ఇలాంటి దాడులు జరగకుండా అరికట్టవచ్చని తెలిపారు. కావున కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు ఆలోచించి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి పైన ఉందని ప్రతి ఒక్కరి బాధ్యతని ఆయన తెలియజేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని మైలారం గ్రామ సర్పంచ్ మాసయ్య గారిపై జరిగిన దాడి చాలా బాధాకరమని కోడేరు మండల ఎస్సై శేఖర్ రెడ్డి గారిని సస్పెండ్ చేసి తగిన శిక్ష పడేవిధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి అధికారులకు ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కోడేరు మండలం అధ్యక్షులు పోలోజు రఘు, ఉపాధ్యక్షులు నారాయణ, సెక్రటరీ కురుమయ్య (నంద), ఎగ్జిక్యూటివ్ నెంబర్ ఎండి సద్దాం, చిన్నంబాయి మండలం జనసేన పార్టీ ఉపాధ్యక్షులు అనుకాల బాలరాజు, కొల్లాపూర్ మండల నాయకులు బత్తిని బాలు, మల్లేష్, అనిల్, రాజేందర్, శీను, రవి, మధు తదితరులు పాల్గొన్నారు.