నాగర్ కర్నూల్ జనసేన కార్యాలయంలో విలేకరుల సమావేశం

నాగర్ కర్నూల్: 2022 డిసెంబర్ 26వ తేదీన మొదలుపెట్టిన పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా పాదయాత్ర మొదటి విడత కార్యక్రమం తెలకపల్లి మండలంలో సోమవారంతో పూర్తి చేసుకున్న సందర్భంగా నాగర్ కర్నూల్ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో వంగ లక్ష్మణ్ గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.. ఈ సందర్భంగా లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ… నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా అనే కార్యక్రమం పాదయాత్ర చేపట్టి, జనసేన పార్టీని ప్రజలకు పరిచయం చేస్తూ.. ప్రజల సమస్యలను తెలుసుకోవడం జరిగింది.. 12 రోజుల పాటు తెలకపల్లి మండంలోని అన్ని గ్రామాల్లో నిరంతరాయంగ జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలు జనసేన పార్టీని స్వాగతిస్తున్నారు. గ్రామాల్లోని ప్రజలు పాలన మారాలి రాజకీయాల్లో యువకులు మరింత ముందుకు రావాలి అని కోరుకుంటున్నారు అని అన్నారు. ప్రతి గ్రామంలోనూ 10 నుంచి 15 బెల్ట్ షాప్స్ ఉన్నాయి యువతను కేవలం మాధ్యమానికి బానిసలను చేస్తున్నారు అని మండిపడ్డారు. వృద్ధులకు సరైన రీతిలో పింఛన్లు అందటం లేదు, వచ్చే వాటిలో కమిషన్లు తీసుకుంటూ.. సమయానికి వారికి పించన్ అందించడం లేదని నిలదీశారు. జమిస్తాపుర్ లో పిల్లలు బడికి వెళ్ళడానికి బస్ సౌకర్యం లేదు, రోడ్లు ఎక్కడికక్కడే చెల్లా చెదురు అయ్యాయి.. ఆ గ్రామంలో ఉండి కూడా అధికార పార్టీనే ఇలాంటి అరాచక పరిపాలనను తరిమికొట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు అని అన్నారు. నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతున్న పట్టించుకోని అధికారపార్టీ.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయ్.. జనవరి 18వ తేది నుంచి ఫిబ్రవరి 1 వరకు రెండో విడతగా బిజినపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా కార్యక్రమం మొదలు కానుంది అని తెలియజేసారు..ఈ సమావేశంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గం నాయకులు గోపాస్ కుర్మన్న, గోపాస్ రమేష్, దేశమోని రాజేష్, నారాముల రవీందర్, కోడిగంటి సాయి, వంశీ, సూర్య, శివ, తదితరులు పాల్గొన్నారు.