హనుమాన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

విజయవాడ వెస్ట్: 40 డివిజన్ చర్చి రోడ్డులో 77వ  స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. జనసేన నాయకులు మరియు న్యాయవాది హనుమాన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా హనుమాన్ విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ 77వ  స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. మనం  స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్నాం గానీ నిజమైన  స్వాతంత్ర్య నాలుగు సంవత్సరాల క్రితమే పోయింది. బ్రిటిష్ పరిపాలన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తుంది. మనం 78వ సంవత్సరం  స్వాతంత్ర్య దినోత్సవం స్వతంత్రంగా జరుపుకోవాలని అంటే పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి అయితేనే అది సాధ్యం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్యాంసుందర్, దాడిశెట్టి దుర్గారావు, జగదీశ్వర్ ప్రసాద్, సూరిబాబు చౌదరి, తానా ప్రతాప్, మంజునాథ్ రెడ్డి చౌదరి, మునూరు భాష, అక్బర్ ఇతరులు పాల్గొన్నారు.