ముమ్మిడివరం మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం నియోజకవర్గం: జనసేన పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ముమ్మిడివరం మండలం, క్రాప చింతలపూడి గ్రామానికి చెందిన ఇటీవల మరణించిన మాదాల సురేష్ కుటుంబ సభ్యులను, చిప్పలపాలెం గ్రామంకు చెందిన ఇటీవల మరణించిన కలిదిండి తేజ వర్మ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చడం జరిగింది. అనంతరం ముమ్మిడివరం రెడ్డివారిపాలెం గ్రామానికి చెందిన ఇటీవల మరణించిన రెడ్డి ధనరాజు కుటుంబ సభ్యులను, అనంతరం గాడిలంక గ్రామానికి చెందిన ఇటీవల మరణించిన అబ్బిరెడ్డి సూర్యకాంతం కుటుంబ సభ్యులను మరియు గాడిలంక గ్రామానికి చెందిన ఇటీవల మరణించిన మహాదశ నాగవేణి కుటుంబ సభ్యు లను పరామర్శించి ఓదార్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ జక్కంశెట్టి పండు, ముమ్మిడివరం మండల అధ్యక్షులు గొలకోటి వెంకటేశ్వరరావు, పితాని రాజు, దూడల స్వామి, మాదాల శ్రీధర్, మాదాల మనీష్, పెన్నాడ శివ, వంగా సీతారాం, గనిశెట్టి శివ, రాయపురెడ్డి రవి, మహాదశ రామ్ సాయి, మొదలగు వారు పాల్గొన్నారు.