వెంగళమ్మచెరువు పంచాయితీలోని మంచి నీటి టాంక్ ను శుభ్రం చేయాలని జనసేన వినతిపత్రం

పుట్టపర్తి, గత రెండు సంవత్సరాలనుండి పుట్టపర్తి మండలంలోని వెంగళమ్మచెరువు పంచాయితీలోని మంచి నీటి టాంక్ ను శుభ్రం చెయ్యకపోవడంతో త్రాగునీరు కలుషితమవుతోందని ఆ గ్రామానికి చెందిన జనసైనికులు పంచాయితీ సెక్రటరీని కలిసి వాటర్ ట్యాంకులను శుభ్రం చెయ్యాలని, పశువులకోసం పెట్టిన నీటి ట్యాంకులను కూడా వాడటానికి అనుకూలంగా చెయ్యాలని కోరుతూ వినతీ పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిగిచర్ల గనేష్, హర్ష, హరీకృష్ణ, అశోక్, అఖిల్, సోము, శశి కుమార్ మరియు పవన్ పాల్గొనడం జరిగింది.