బాబు జగ్జజీవన్ రామ్ విగ్రహావిష్కరణలో పాల్గొన్న బత్తుల

రాజానగరం నియోజకవర్గం: దేశంలో సామజిక న్యాయ సాధన కోసం కృషిచేసిన డా. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం సీతానగరం మండలం, పుణ్యక్షేత్రం పంచాయతీ పరిదిలోని రామచంద్రపురం గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన రాజానగరం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ కు రామచంద్రపురం గ్రామ ప్రజలు అఖండ స్వాగతం పలికారు. కార్యక్రమంలో భాగంగా బత్తుల బలరామకృష్ణ జనసేన నాయకులు, జనసైనికులతో కలిసి విగ్రహావిష్కరణ చేసారు. అనంతరం విగ్రహానికి పూల మాలలు వేసి వారి సేవలను స్మరించుకుని “జోహార్ బాబు జగ్జీవన్ రామ్” అంటూ నినాదాలు చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు.