పవనన్న ప్రజాబాట 87వ రోజు

  • సమాజమే దేవాలయం
    ★ అర్హులైన ప్రతి ఒక్కరికి సహాయం
    ★ పలు వార్డులలో డాక్టర్ కందుల పర్యటన
    ★ 87వ రోజుకు చేరిన పవనన్న ప్రజా బాట కార్యక్రమం

విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పవనన్న ప్రజాబాట కార్యక్రమం 87వ రోజు విజయవంతంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నవ వధువుకు అలాగే ముగ్గురు పుష్పవతి అయిన అమ్మాయిలకు సహాయం అందజేశారు. 31 వ వార్డు కృష్ణ గార్డెన్స్ లో గల ప్రేమసమాజంలో ఉంటున్న కనకమహాలక్ష్మి కుమార్తె మేఘన వివాహం నిమిత్తం ఆమెకు బంగారు తాళిబొట్టు, పట్టు వస్త్రాలను అందజేశారు. అలాగే 33 వ వార్డు అల్లిపురం ప్రాంతానికి చెందిన పుష్పవతి అయిన నిహారిక కు కూడా వెండి పట్టీలు, పట్టు వస్త్రాలను అందించారు. అదేవిధంగా 34 వ వార్డు అచ్చియమ్మ పేట ప్రాంతానికి చెందిన పుష్పవతి అయిన పవిత్రకు, వెండి పట్టీలు, పట్టు వస్త్రాలు అందించారు. 35 వ వార్డు కల్లుపాకల ప్రాంతానికి చెందిన పుష్పవతి అయిన భూలక్ష్మికి వెండి పట్టీలు, పట్టు వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ సమాజమే దేవాలయం అన్నారు. ప్రతి ఇల్లు సంతోషంగా ఉంటే సమాజం కూడా ఆనందంగా ఫరడవిల్లుతుందని చెప్పారు. ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా ఒక సామాన్య పౌరుడిగా కూడా సామాజిక బాధ్యతతో స్పందిస్తూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. తను చేపడుతున్న కార్యక్రమాలకు జనసేన పార్టీ నాయకత్వం కూడా మద్దతుగా నిలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి అనేదే తన ఉద్దేశమని చెప్పారు. ఎవరికీ ఎటువంటి కష్టం వచ్చినా వారిని ఆదుకునేందుకు తాను ఎప్పుడూ ముందు ఉంటానని పేర్కొన్నారు. తను చేపడుతున్న పవనన్న ప్రజా బాట కార్యక్రమం కొనసాగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రూపా, నిలం రాజు, రఘు, రవి భవాని, వరలక్ష్మి, గాజుల శ్రీను, హరీష్, శ్రీదేవి, కోదండమ్మ, లలిత, పద్మ, వరలక్ష్మి, కుమారి, జనసేన యువ నాయకులు కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్, మంగ, బద్రి, ప్రసాద్, వరలక్ష్మి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.