ఇసుక తవ్వకాల మీద తగిన చర్యలు తీసుకోవాలని జనసేన వినతి

ఉమ్మడి ప్రకాశం జిల్లా, పర్చూరు నియోజకవర్గం, చిన్నగంజాం మండల పరిధిలో అనుమతి లేకుండా జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాల మీద తగిన చర్యలు తీసుకోవాలని శనివారం చిన్నగంజాం మండలానికి విచ్చేసిన బాపట్ల జిల్లా కలెక్టర్ కి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ్ కుమార్ మరియు జనసేన పార్టీ జిల్లా మరియు నియోజకవర్గం నాయకులు జనసేన పార్టీ తరుపున వినతి పత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సందు శ్రీనివాసరావు, మండల ప్రధాన కార్యదర్శి అడుసుమల్లి హరిబాబు, పర్చూరు నియోజకవర్గ నాయకులు తోట అశోక్ చక్రవర్తి, గంట వెంకటేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి షేక్ ఇంతియాజు, తుమ్మలపెంట సతీష్, పారాబత్తుల ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.