రాజంపేటలో వైభవంగా క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

రాజంపేట నియోజకవర్గం, వీరబల్లి మండలం, సానిపాయి గ్రామంలో ఆదివారం మండల జనసేన నాయకులు గుగ్గిళ్ళ నాగార్జున ఆధ్వర్యంలో వీరబల్లి మండలంలోని 230 మంది జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు రాజంపేట జనసేన నాయకులు అతికారి దినేష్ చేతుల మీదుగా సభ్యత్వ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిలు తాతంశెట్టి నాగేంద్ర, ముఖరం చాంద్, రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన, కడప జనసేన పార్టీ ఇంచార్జ్ సుంకర శ్రీనివాస్ లు పాల్గొన్నారు. మొదట సానిపాయి చెక్ పోస్ట్ దగ్గర నుంచి ఏర్పాటుచేసిన ర్యాలీలో నాయకులందరూ పాల్గొని అక్కడి నుంచి భారీ ర్యాలీగా కార్యక్రమం జరిగే వేదిక వద్దకు చేరుకొని అనంతరం జనసేన క్రియాశీలక సభ్యులకు సభ్యత్వ కిట్లను పంపిణీ చేశారు. జనసేన పార్టీ కార్యకర్తలు వీర మహిళలను ఉద్దేశించి నాయకులందరు మాట్లాడుతూ జనసేన పార్టీ బలోపేతంపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అతికారి దినేష్ ఆధ్వర్యంలో సానిపాయికీ చెందిన వైసిపి టిడిపి పార్టీల నుంచి 50 కుటుంబాలు జనసేన పార్టీలో చేరడం జరిగింది. అతికారి దినేష్ మాట్లాడుతూ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం క్రియాశీలక సభ్యత్వం జనసేన పార్టీ ద్వారానే సాధ్యమైంది. ప్రతి జన సైనికుడికి వారి కుటుంబ సభ్యులకు అండగా ఉండాలి అన్నదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశం. భారతదేశంలోనే అనేక దశాబ్దాలగా అనేక రాజకీయ పార్టీలో ఉన్న అధికారం అనుభవించిన పార్టీలు ఉన్నా జనసేన పార్టీ అధికారంలో లేకపోయినా జనసైనికులకు వారి కుటుంబాలకు ఏదైనా ప్రమాదవశాత్తు జరిగినా ఐదు లక్షల ప్రమాద బీమా 50వేల రూపాయలు ఆరోగ్య బీమా వారికి అందజేసి అండగా నిలబడుతున్నాం అంటే అందుకు కారణం ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ ఆ మహోన్నత వ్యక్తికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా వీరబల్లి మండల జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన వంటి పార్టీ పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు రెడ్డి రాణి, రూప, జనసేన పార్టీ నాయకులు జోగినేని మనీ, ఓబులేసు, గుగ్గిళ్ళ వెంకటేష్, నేతి వెంకటేష్, నాగరాజ, ఓబులయ్య, హేమంత్, పఠాన్ తదితరులు పాల్గొన్నారు.