మా ఇంటి పై వైసీపీ కౌన్సిలర్ దాడి అమానుషం: గంటా కృష్ణ

నా భర్త ఇంట్లో లేని సమయంలో మా వార్డు కౌన్సిలర్ జిల్లెల్ల దిలీప్ కుమార్ శనివారం రాత్రి 9:30 నిమిషాలకు ఇంటి కి వచ్చి అసభ్య పదజాలంతో దుర్భాషలాడడం అమానుషమని స్థానిక 26వ వార్డు జనసేన పార్టీ తరఫున కౌన్సిలర్ గా పోటీ చేసి 15 ఓట్ల తో ఓటమిపాలైన గంటా కృష్ణ ఏర్పాటుచేసిన పాత్రికేయ సమావేశంలో ఆమె భార్య గంటా నాగ దుర్గాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన సీఎం బహిరంగ సభ ప్రాంగణంలో రోడ్డు వద్ద ఏర్పాటుచేసిన ఫ్లెక్సీని మీరే చింపారు అంటూ మా ఇంటి పైకి వచ్చి మీ ఆయన ఆడింగి.. దమ్ముంటే బయటికి రా అనడమే కాకుండా నన్ను నా కూతుర్లను బూతు పదజాలంతో దుర్భాషలాడారు. అదే రోజు రాత్రి 11 గంటలకు పట్టణ పోలీస్ స్టేషన్లో మా వార్డు కౌన్సిలర్ పై ఫిర్యాదు చేయగా.. పోలీసు అధికారులు ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని గంటా కృష్ణ అన్నారు. మా ఇంటి సమీపంలో సీసీ కెమెరా ఫుటేజ్ లు పరిశీలించగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీ ని చింపేయడం గుర్తించవచ్చు అన్నారు. ముఖ్యమంత్రి జనసేన ను రౌడీసేనగా అభివర్ణించారని మరి రౌడీ సేనగా ఏ పార్టీకి వర్తిస్తుందో ఆత్మ విమర్శ చేసుకోవాలి అన్నారు. పట్టణ అధ్యక్షులు కోటిపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పార్టీ ఉనికిని కోల్పోతున్న వైసిపి జనసేన నేతలపై ఇటువంటి దాడులు చేయడం భయ భ్రాంతులను చేయడం నిత్య కృత్యమైందన్నారు. అంబటి అరుణ మాట్లాడుతూ మహిళలకు భద్రత కల్పిస్తాను అన్న ఈ ప్రభుత్వం మగవారు ఇంట్లో లేని సమయంలో ఆడవారిపై దౌర్జన్యం చేయడం, దుర్భాషలాడటం సమ్మతమేనా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఫ్లెక్సీలను చింపిన నిజమైన దోషులను పట్టి, మా ఇంటి పైకి వచ్చిన వైసీపీ కౌన్సిలర్ జిల్లెల్ల దిలీప్ కుమార్ ను అతని అనుచరులను అదుపులోకి తీసుకొని విచారణ చేయవలసిందిగా డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కోటిపల్లి వెంకటేశ్వరరావు, బందెల రవీంద్ర, కౌన్సిలర్లు భారతి, సురేష్, తోట అరుణ, కొప్పాడి కృష్ణవేణి, నాయకులు వట్టిప్రోలు సతీష్, గాదె ఆది బాబు, మాదం వాసు, అంబటి అరుణ, పోలిశెట్టి నళిని, బళ్ల హనుమంత్, చముకురి సుబ్రహ్మణ్యం, గ్రంధి నాని, గన్నబతుల ప్రసాద్, కమిసెట్టి గణేష్, యాడ్లపల్లి నాని పాల్గొన్నారు.