కొణిజర్ల మండల కోఆర్డినేటర్ గా పఠాన్ మదార్ ఖాన్

వైరా నియోజకవర్గం: వైరా నియోజకవర్గంలో జనసేన బలోపేతం చేయడంలో భాగంగా లాలపురం గ్రామానికి చెందిన పఠాన్ మదార్ ఖాన్ (బన్నీ) ని కొణిజర్ల మండల కోఆర్డినేటర్ గా వైరా నియోజకవర్గ ఇంఛార్జి డా. సంపత్ నాయక్ నియమించారు. పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా అనేక సేవాకార్యక్రమాలు చేస్తున్న బన్నీ ఆధ్వర్యంలో కొణిజర్ల మండలంలో పార్టీ బలపడుతుందని సంపత్ నాయక్ అన్నారు. ఈ సందర్భంగా తనకి మండల కోఆర్డినేటర్ గా అవకాశం కల్పించిన సంపత్ నాయక్ కు బన్నీ కృతజ్ఞతలు తెలియజేశారు.