పార్వతీపురం టిడిపి రిలే నిరాహార దీక్షకు జనసేన సంఘీభావం

  • జనసేన – తెలుగుదేశం పొత్తుతో ప్రజా ప్రభుత్వం రావాలి – వైసీపీ ప్రభుత్వం పోవాలి
  • తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వెంటనే విడుదల చెయ్యాలి
  • వైసీపీ ప్రభుత్వం అంతమే జేయంగా కలిసి పనిచేస్తాం అని తెలిపిన జనసేనపార్టీ నాయకులు

పార్వతీపురం నియోజకవర్గం: తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా పార్వతీపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, ఇంచార్జ్ విజయ్ చంద్ర ఆధ్వర్యంలో జరిగిన రిలే నిరాహార దీక్షకు జనసేన పార్టీ నాయకులు సంఘీభావం తెలిపి రిలేనిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చందక అనీల్, గోర్లీ చంటి, రాజాన రాంబాబు, సిరిపురపు గౌరీ, ఇజ్జాడా కాలి, సొంటేన శ్రీను, కడగల గణేష్, బాలు, వంశీ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.