తాడిపత్రిలో టిడిపి రిలే నిరాహార దీక్షకు జనసేన మద్దతు

తాడిపత్రి నియోజకవర్గం: జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమ అరెస్ట్ కు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రిలే నిరాహారదీక్షలకు జనసేన మద్దతు తెలుపుతూ శనివారం తాడిపత్రి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభకర్ రెడీ మరియు గన్నేవారిపల్లే పంచాయితీ మాజీ సర్పంచ్ చింబిలి వెంకట రమణ అధ్వర్యంలో నిర్వహించిన రిలే నిరాహారదీక్షలో తాడిపత్రి జనసేనపార్టీ పట్టణ అధ్యక్షులు కుందుర్తి నరసింహా చారి మద్దతు తెలుపుతూ రిలే నిరాహారదీక్షలలో పాల్గొని ప్రసంగింస్తూ మన సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడు కాబట్టి అందరూ అవినీతిపరులు అనే బురద జల్లి జైల అందరినీ తనలానే జైల్ కు వెళ్ళాలని అనుకుంటూ అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఏ ఒక్క జనసైనికుడు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ కేసులకు భయపడరు అని విమర్శించారు. రాబోయే 2024 ఎన్నికల్లో జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే వైసీపీ ఓడిపోతుందని భయంతో కలకుండ ప్రయత్నం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు వారి ఎత్తులని చిత్తు చేసే విధంగా అద్భుతమైన వ్యూహంతో రెండు పార్టీలు కలిసి పోటీ చేసే విధంగా ప్రణాళికలు తయారు చేసే వైసీపీ ఇంటికి పంపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అని నిర్దేశించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కోడి సునీల్ కుమార్, దూద్ వలి మరియు నాయకులు కిరణ్, గోపాల్, ఇమామ్, రబ్బానీ అయుబ్, శివకుమార్ రెడ్డి, అమీర్, పవన్ కళ్యాణ్, మని, కొండ శివ, హేమంత్ కుమార్, వెంకటేష్, మధు పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.