ప్రెవేట్ స్కూల్ లో చిన్నారి మృతి- సంఘటనా స్థలాన్ని పరిశీలించిన జనసేన నాయకులు

గుంతకల్లు: పట్టణంలోని శ్రీ విద్యా ప్రైవేట్ స్కూల్ లో రేకుల షేడ్ బండ విరిగిపడి చిన్నారి మరణించిన విషయాన్ని తెలుసుకున్న అనంతపురం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి అరికెరి జీవన్ కుమార్, జనసేన పార్టీ నాయకులు పవన్ నెట్టి, గుంతకల్లు జనసేన పార్టీ 1వ వార్డ్ ఇంఛార్జి హెన్రీ పాల్, 31వ వార్డు ఇంఛార్జి తాడిపత్రి విజయ్ కుమార్, గుంతకల్లు నియోజకవర్గం మైనార్టీ నాయకులు జీలాన్ బాషా, జనసేన పార్టీ నాయకులు తాడిపత్రి మహేష్, బోయ వీరేష్ కుమార్, సమీర్ శ్రీ విద్యా ప్రైవేట్ స్కూల్ కి వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించి అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ జనసేన పార్టీ తరపున రేండు నెలల క్రితం ఎం.ఈ.ఓగారికి మరియు ఆర్.డి.ఓకి అనేక పాఠశాలలలు నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలో ఉన్నాయని, ఫీజుల వసూళ్లకు సంబంధించి విద్యా దోపిడిని అరికట్టాలని అనేక సందర్భాల్లో తెలియజేయడం జరిగింది. అయినా వారు చర్యలు తీసుకోకపోవడంతో ఇలాంటి సంఘటన జరిగిందని. ప్రభుత్వము వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.