వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్ జనసేన లక్ష్యం

  • ఇంకోసారి వైసిపి అధికారంలోకి వస్తే మన ఆస్తులను ఆ పార్టీకీ అప్పగించాలి
  • రాష్ట్రాన్ని వదిలేసి పక్క రాష్ట్రాలకు పారిపోవాలి
  • ఎపి ప్రజలకు మంచి భవిష్యత్తును ఇవ్వడమే పవన్ కళ్యాణ్ లక్ష్యం
  • ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ నాయకుల సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొడిదల నాగబాబు

చిత్తూరు: వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్.. జనసేన లక్ష్యమని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొడిదల నాగబాబు. తిరుపతిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో జరిగిన ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ నాయకుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. అలాగే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళల మనోగతాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్ చేయడమే జనసేన లక్ష్యమన్నారు. అందుకోసం పార్టీ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. మరో సారి వైసిపికి అధికారం ఇస్తే ప్రజల ఆస్తి పత్రాలను ఆ పార్టీకి ఇచ్చేసి పక్క రాష్ట్రాలకు పరిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. బంధుప్రీతి లేని ఏకైక పార్డీ జనసేన అన్నారు. అలాగే రాక్షస పాలనను అంతమొందించాల్సిన బాధ్యత జనసైనికులపై ఉందన్నారు. జనసేనాని చెప్పిన వ్యక్తులను గెలిపించుకోవాల్సిన బాధ్యత జనసైనికులపై ఉందన్నారు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే పార్టీ జనసేన పార్టీ అన్నారు. స్కామ్ లు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టమన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందన్నారు. క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరూ పది తటస్థ ఓట్లను వేయించే బాధ్యత తీసుకోవాలన్నారు. చిత్తూరు జిల్లాలో ఒక్క సీటు కూడా వైసిపికి రాకుండా చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, తిరుపతి నగర అధ్యక్షులు రాజారెడ్డి, కాళహస్తి ఇంచార్జ్ వినూతకోట, సత్యవేడు లావణ్య కుమార్,హేమ కుమార్, నగరి మెరుపుల మహేష్ స్వామి నాథన్ , జీడీ నెల్లూరు ఇంచార్జ్ పొన్న యుగందర్, మదనపల్లి నాయకులు రాందాస్ చౌదరి గంగరపు స్వతి, దారం అనిత, జంగాల శివరాం, మై ఫోర్స్ మహేష్, చంద్రగిరి నాయకులు బీగల అరుణ, నాసీర్, దేవర మనోహర్ పాల్గొన్నారు.