సీఎం గో బ్యాక్ – గో బ్యాక్ జగన్

విజయవాడ వెస్ట్: 43వ డివిజన్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో తులసి మురళి ఇంటి దగ్గర గురువారం గో బ్యాక్ జగన్ గో బ్యాక్ జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఏ మొహం పెట్టుకొని పశ్చిమ నియోజకవర్గం వస్తున్నారండి మీరు? పశ్చిమ నియోజకవర్గంలోని 13,000 మంది మహిళలకు జగనన్న కాలనీల పేరుతో ఉత్తితి కాగితాలు ఇచ్చి మోసం చేసినందుకు వస్తున్నారా? పశ్చిమ నియోజకవర్గంలో శాంక్షన్ అయిన టిట్కోళ్ళను నాలుగున్నర సంవత్సరాల నుంచి ఇవ్వనందున వస్తున్నారా? పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధికి ఏ విధంగా సహకరించిన మీరు పశ్చిమ నియోజకవర్గం రావడానికి అర్హులు కాదు. రేపు మిమ్మల్ని మా జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ పోతిన వెంకట మహేష్ గారి నాయకత్వంలో తప్పకుండా అడ్డుకుని తీరుతామని జనసేన నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షాహిద్ మహేశ్వరి, సూరిబాబు, కిరణ్, రాజేష్ పాల్గొన్నారు.