వినాయక అన్న సమారాధనలో పాల్గొన్న బత్తుల బలరామకృష్ణ

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, దివాన్ చెరువు గ్రామంలో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన వినాయక అన్నసమారాధన కార్యక్రమంలో రాజానగరం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. దివాన్ చెరువు గ్రామంలో వినాయక మండపాన్ని సందర్శించి విగ్నేశ్వరున్ని దర్శించి స్వామి వారి తీర్థప్రసాదములు స్వీకరించారు. అనంతరం ఆలయ కమిటీ వారు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారిని శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దివాన్ చెరువు గ్రామ జనసేన పార్టీ నాయకులు యర్రంశెట్టి శ్రీను, మురళి, మున్సబ్, అడబాల హరి, తోట అనిల్ వాసు, అరిగెల రామకృష్ణ, నాతిపం దొరబాబు, వేగిశెట్టి రాజు, దేవన దుర్గ ప్రసాద్ (డి.డి), మరియు జనసైనికులు పాల్గొన్నారు.