చెరుకుపల్లి రామలింగం ఆధ్వర్యంలో విస్తృతస్థాయి సమావేశం

తెలంగాణ, నకిరేకల్ నియోజకవర్గంలో మంగళవారం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ చెరుకుపల్లి రామలింగం ఆధ్వర్యంలో విస్తృతస్థాయి సమావేశం మరియు సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జ్ ఇన్చార్జ్ చెరుకుపల్లి రామలింగం చేతుల మీదుగా క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న సభ్యులకు క్రియాశీలక సభ్యత్వ కిట్లను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇన్చార్జ్ చెరుకుపల్లి రామలింగం మాట్లాడుతూ అధినేత రూపొందించిన ఈ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం చాలా అద్భుతమైనదని, ఇప్పటికే ఈ కార్యక్రమం ద్వారారా అనేక మంది కార్యకర్తల కుటుంబాలను అధినేత అండగా నిలబడ్డారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.