జి.మాడుగుల జనసేన మండల కమిటీ సమావేశం

పాడేరు నియోజకవర్గం: జి.మాడుగుల మండలంలో జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం మండల కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న కార్యనిర్వహన కమిటీ అధ్యక్షులు తాంగుల రమేష్, మండల ప్రధాన నాయకులు మసాడి సింహాచలం మాట్లాడుతూ త్వరలోనే గ్రామస్థాయి పర్యటనలో భాగంగా పంచాయితి ఎంపికలు ఉంటుందని ముందుగా పర్యటన చేసే పంచాయతీలో స్థానిక జనసైనికులకు, వీరమహిళలకు సమాచారాన్ని చేరవేస్తామని అందుకు తగిన ఏర్పాట్లతో మన పంచాయితి సమస్యలు మన బాధ్యత అనే అంశంపై పూర్తి స్థాయిలో పరిశీలన ఉంటుందని తెలియజేసారు. అలాగే గౌరవ అధ్యక్షులు తెయ్యవడా వెంకట రమణ మాట్లాడుతూ గ్రామస్థాయిలో పార్టీ విధి విధానాలు ఆదివాసీలకు తెలియజేస్తూ ప్రస్తుత ప్రభుత్వ గిరిజన వ్యతిరేక విధానాలను తెలియజెయ్యాల్సిన బాధ్యత ముక్యంగా యువత తీసుకోవాలని అన్నారు. మండల బూత్ కన్వీనర్ భానుప్రసాద్ కొర్ర మాట్లాడుతూ ఇప్పటికే పలు పంచాయతీల వారిగా కొత్తగా యువ ఓటర్లు నమోదు ప్రక్రియ చేశామని పంచాయితి స్థాయిలో నాయకత్వం చెయ్యడానికి సరికొత్త రాజకీయ విధానాలు జనసేన పార్టీ సిద్ధాంతాలు ఆచరించే కొత్త నాయకత్వానికి ఆదివాసీ ప్రజలు సిద్ధపడలన్నారు. ఈ సమావేశంలో మండల నాయకులు మసాడి సింహాచలం, కార్యనిర్వహన కమిటీ సభ్యులు తాంగుల రమేష్, గౌరవ అధ్యక్షులు తెరావాడ వెంకటరమణ, మండల బూత్ కన్వీనర్ కొర్ర భానుప్రసాద్, నాగేశ్వరరావు, సోమన్న చందు తదితరులు పాల్గొన్నారు.