వాకా శ్రీనివాస్ ఆమరణ దీక్షకు నిడదవోలు జనసేన మద్దతు

నిడదవోలు నియోజకవర్గం: నిడదవోలు మండలం పెండ్యాల గ్రామంలో ఆ గ్రామ సమస్యలపై జనసేన పార్టీ ఎంపీటీసి వాకా శ్రీనివాస్ ఆమరణ దీక్షను చేపట్టడం జరిగింది. ఈ దీక్షలో ఎంపీటీసీ వాకా శ్రీనివాస్ మాట్లాడుతూ పెండ్యాల గ్రామ ప్రజా సమస్యలపై చాలా సార్లు ఎమ్మెల్యేకి, ప్రజాప్రతినిధులుకు తెలిపిన పట్టించుకోని కారణంగా, ఇప్పటి వరకు తనని గెలిపించిన తన గ్రామానికి న్యాయం చెయ్యడానికి ఈ ఆమరణ నిరహార దీక్షకు పూనుకోవడం జరిగిందని తెలిపారు. తనకు న్యాయం జరిగే వరకు దీక్ష విరమించేది లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నిడదవోలు మండలం అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం (పీవీఆర్), పాల వీరాస్వామి, టౌన్ నాయకులు రంగా రమేష్, మేడా పూర్ణ, పవన్, రూపేంద్ర, రాజా, బాలు, జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు సంఘీభావం తెలిపారు.