గొల్ల, కురుమలకు ఇచ్చిన హామీలను విస్మరించిన ప్రభుత్వం: మేరుగు శివ కోటి యాదవ్

తెలంగాణ, నర్సంపేట నియోజకవర్గంలో “జనంతో జనసేన” కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ మేరుగు శివ కోటి యాదవ్ గొల్ల, కురుమలను కలిసి వారితో చర్చించి వారి సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గంలో గొల్ల, కురుమలకు రెండవ విడత గొర్రెల పంపిణీ అందలేదని, నియోజకవర్గఒలో రెండవ విడతలో 6041 మంది లబ్ధిదారులు ఉండగా కేవలం 138 మందితో డి.డి కట్టించి 54 మందికి అందచేసి చేతులు దులుపుకోవడం విడ్డూరమని, గత ఎన్నికల్లో ప్రతి కులస్తులకు ప్రభుత్వం తరఫున కుల సంఘ భవనాలు నిర్మిస్తానని హామీ ఇచ్చి, గెలిచాక అధికార పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే విస్మరించారని, ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తూ కులాల వారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విభజించి పాలిస్తుందని, కులాలు కలిపే ఆలోచనా విధానం జనసేన పార్టీ సిద్ధాంతమని జనసేనకు ఒకసారి అవకాశమివ్వాలని వారిని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు గద్దల కిరణ్, బర్ల నాగరాజు, చెన్నూరి దామోదర్, జనసేన నాయకులు వంగ మధు, ఓర్సు రాజేందర్, రాపోలు సురేష్, నర్మెట్ట రాజేష్, శ్రీకాంత్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.