గొల్లప్రోలు వైసీపీ మాజీ పట్టణ అధ్యక్షులు పర్ల రాజా జనసేనలో చేరిక

  • గొల్లప్రోలులో భారీ బైక్ ర్యాలీ,
  • వైసీపీ క్యాడర్ రాకతో పట్టణంలో బలం పుంజుకున్న జనసేన
  • వైసీపీలో ఉన్న నాయకులుకు కేవలం అనుమానాలు అవమానాలే దక్కుతాయి అని ఆగ్రహం వ్యక్తం చేసిన పర్ల రాజా
  • పిఠాపురంలో జనసేన జెండా ఎగరేస్తాం
  • భారీ మెజారిటీ సాధించి తిరుతాం, తగ్గేదేలే అంటున్న తంగెళ్ళ

పిఠాపురం, వైసీపీ పార్టీ గొల్లప్రోలు పట్టణం మాజీ అధ్యక్షులు పర్ల రాజా ఆ పార్టీకి రాజీనామా చేసి శనివారం గొల్లప్రోలు పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి వైసీపీ క్యాడర్ తో జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఇంచార్జ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ సమక్షంలో జనసేన తీర్ధం పుచ్చుకున్నారు. సాయంత్రం తమ మిత్ర బృందంతో ముందుగా ఇంచార్జ్ ఉదయ్ శ్రీనివాస్ కి వందల సంఖ్యలో బైక్ ర్యాలీతో గొల్లప్రోలు పట్టణంలో స్వాగతం పలికి, భారీ బాణాసంచాతో పూల వర్షంతో పట్టణం మొత్తం భారీ ర్యాలీను విజయవంతం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో జనసేన ఇంచార్జ్ ఉదయ్ శ్రీనివాస్ జనసేన కండువా వేసి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా పార్టీలో చేరిన రాజా మాట్లాడుతూ నా బంధువులు, క్యాడర్, మిత్ర బృందం నన్ను జనసేన పార్టీని నమ్మి వెంట వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అని జనసేన లాంటి నిజాయితీ గల పార్టీలో చేరినందుకు గర్వపడుతున్నాను అని తెలియజేసారు. వైసీపీ లాంటి పార్టీలో గుర్తింపు కానీ గౌరవం కాని దక్కడం లేదని అనేక మంది నాయకులు బాధపడుతున్నారు అని వైసీపీలో వారికి అవమానాలే దక్కుతాయి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో నా సత్తా ఏంటో చూపిస్తాను అని భారీ మెజారిటీతో తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ని పిఠాపురం నియోజకవర్గంలో గెలిపించుకుంటామన్నారు. అనంతరం ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీలోకి వచ్చిన రాజాకి వారి మిత్ర బృందంకు ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేసారు. వైసీపీ అధికారాన్ని చేపట్టిన క్షణం నుంచి రాష్ట్రంలో ఎవరూ ప్రశాంతంగా బ్రతకడం లేదని, వైసీపీ పాలనలో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలి అంటే జనసేన – టిడిపి ప్రభుత్వంతో సాధ్యమవుతుందన్నారు. ప్రజల్లో బలమైన మార్పు మొదలైందని అందుకే జనసేన పార్టీ పట్ల ప్రజల్లో రోజురోజుకీ ఆదరణ పెరుగుతుందని తెలిపారు. పిఠాపురం నియోజకవర్గం వ్యాప్తంగా రానున్న రోజుల్లో మరిన్ని భారీ చేరికలు ఉంటాయని, ఇంతటి ఘన స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసారు. పార్టీలోకి వచ్చిన ప్రతి నాయకుడుకి సముచిత స్థానం కల్పిస్తాం అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం నాయకులు మరియు గొల్లప్రోలు మండల నాయకులు, జనసైనికులు మరియు వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.