వైకాపాను సాగనంపుదాం: ముకరం చాంద్

రాయచోటి: ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న వైకాపా ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో చిత్తుగా ఓడించి, ప్రజా సంక్షేమం కొనసాగించే పార్టీని అధికారంలోకి తీసుకురావాలని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముకరం చాంద్ పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని ఓ సమావేశం ఏర్పాటు చేసిన మందిరంలో జనసేన పార్టీ రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ షేక్ హసన్ భాషా ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో మండలాల నాయకులు, కార్యకర్తలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి జనసేన నాయకులు ఆహ్వానించారు. రాష్ట్ర కార్యదర్శి ముకరం చాంద్ మాట్లాడుతూ.. జనసేన చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు పఠాన్, ప్రదీప్, షబ్బీర్, రాయచోటి నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షుడు జయరామ్, జనసేన వివిధ మండలాల నాయకులు గేట్ బాబ్జి, కొండా, భారత్,దినేష్, రాజంపేట పార్లమెంట్ నాయకులు రామ శ్రీనివాస్, ఉమ్మడి కడపజిల్లా కార్యక్రమాల సభ్యులు రియాజ్, వీరమహిళలు రెడ్డిరాణి, రూప, జనసైనికులు బాలాజీ, ఖాసిమ్, ఎహెసన్, ఫాహాద్ తదితరులు పాల్గొన్నారు.