తటవర్తి కోటేశ్వరరావుకు అండగా జనసేన

పెడన నియోజకవర్గం, గూడూరు మండలం కోకనారాయణపాలెం గ్రామ జనసైనికులు తటవర్తి కోటేశ్వరరావు గురువారం ఉదయం చెట్టుపై నుండి ప్రమాదవశాత్తు పడిపోవడం వలన రెండు కాళ్ళు విరిగిపోయాయి మరియు ఛాతీ, తలకు బలమైన గాయాలయ్యాయి. మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళగా మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళడం జరిగింది. ఈ ప్రమాద విషయాన్ని కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామ్ కి తెలియజేయగా వెంటనే విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి జనసైనికుడిని చూసి మరియు తక్షణ సాయంగా వారి కుటుంబానికి రూపాయలు 10000/- అందజేసి, అధైర్య పడొద్దని జనసేన పార్టీ అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చారు.