సోషల్‌ మీడియాలో మితిమీరొద్దు

  • సోషల్ మీడియాలో పెట్టే పొస్టులు ఆహ్లాదకరంగా వుండాలి

పలాస: శాంతిభద్రతలు దెబ్బతినేలా ఎవరైనా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కాశీబుగ్గ సి ఐ హెచ్చరించారు. అలాగే సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను కట్టడి చేసేందుకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ మేరకు పలాస నియోజకవర్గ పరిదిలోని కాశీబుగ్గ సి.ఐ అన్ని నియోజవర్గ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసారు. ఈ ఆహ్వానం మేరకు అన్ని నియోజవర్గ పార్టీల నాయకులతో పాటు జనసేన పార్టీ తరుపున కృష్ణారావు హాజరైనాను. సమావేశంలో భాగంగా సీ ఐ అన్ని పార్టీల వారిని ఉద్దేశించి సోషల్ మీడియాలో పెట్టే మెసేజ్ లు ఆహ్లాదకరంగా వుండాలి. వ్యవస్థ చేసే తప్పుడు కార్యక్రమాలపై స్పందించాలి, గానీ మన పార్టీ మీద గానీ, ఇతర పార్టీల మీద గానీ వ్యక్తి గతంగా పేర్లు పెట్టి మెసేజ్ లు పెట్టుట వలన తగువులు రావచ్చు. నిబంధనలు అతిక్రమించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరి పార్టీ వారికి వాళ్ళ నాయకులే చెప్పాలని తెలియజేసారు. ఈ సమావేశం అనంతరం జనసేన తరుపున సమావేశానికి హాజరైన కృష్ణారావు పత్రికా ముఖంగా మాట్లాడుతూ ఇకపై మన జనసైనికులందరు దయచేసి సోషల్ మీడియాలో వ్యక్తులను ఉద్దేశించి ఎటువంటి మెసేజ్ లు పెట్టవద్దు. మన పార్టీని ఎలా ముందుకు తీసుకు వెళ్ళాలి అనే విధంగా మంచి మెసేజ్లు పెట్టండి అని కృష్ణారావు మనవి చేసారు. ఒకవేళ చెడుగా మెసేజ్ లు పెడితే వారే బాధ్యత వహించవలసి ఉంటుందని తెలిపారు.