జనసైనికుడికి అండగా నిలచిన జనసేన నాయకులు

ఎచ్చెర్ల: రణస్థలం గ్రామానికి చెందిన జనసైనికుడు పిన్నింటి హరి (32) ఇటీవల యాక్సిడెంట్ కు గురై రెండు కాళ్ళు & ఒక హ్యాండ్ ఫ్రాక్చర్స్ అయ్యాయి, హరి వైద్యం నిమిత్తం హాస్పిటల్ కి 6లక్షల రూ అవుతుందిని డాక్టర్స్ చెప్పారు, ఈ విషయం తెలుసుకున్న శ్రీకాకుళం జిల్లా కాపు సంక్షేమ సేన యువజన విభాగం కార్యదర్శి & జనసేన పార్టీ నాయకులు గొర్లె సూర్య హరికి 15000 రూపాయలు, గొర్లె గౌరీనాయుడు 5000/- ఆర్ధికంగా సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గొర్లె గౌరీనాయుడు, అయ్యప్ప, జగదీష్, అప్పన్న, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.