కనకదుర్గమ్మ వారి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్న జ్యోతుల

  • ఆదిదుర్గమ్మ ఆలయము నందు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న జ్యోతుల

పిఠాపురం నియోజకవర్గం: గొల్లప్రోలు మండలం, ఏకే మల్లవరం గ్రామంలో ఆదిదుర్గమ్మ ఆలయము నందు దేవీనవరాత్రుల అనంతరం సోమవారం ఆదిదుర్గమ్మ ఆలయ కమిటీవారి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం జరిగినది. మహా అన్నదాన కార్యక్రమానికి ఆదిదుర్గమ్మ ఆలయకమిటీ వారి ఆహ్వానం మేరకు ఆదిదుర్గమ్మ ఆలయమునందు టైల్స్ వేయించిన దాత, జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు సోమవారం సమయంలో ఏకే మల్లవరం గ్రామంలో గల ఆదిదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించి, అమ్మవారిని దర్శనాన్ని చేసుకుని, అనంతరం జరుగుతున్న మహాఅన్నదాన కార్యక్రమంలో పాల్గొని అనంతరం ఆలయకమిటీ వారిచ్చిన అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆదిదుర్గమ్మ దేవాలయకమిటీ సభ్యులు, ఏకే మల్లవరం గ్రామపెద్దలు బులిపే సూరిబాబు, కుంచే రామచంద్రరావు, బత్తిన సుబ్రహ్మణ్యం, నున్న నూకరాజు, పులుగు సుబ్రహ్మణ్యం, మొయ్య నాగబాబు, పల్లెటి గంగరాజు, ఎద్దు వెంకటరమణ, సత్తాడా సూరిబాబు, మేడపాటి వరప్రసాద్, పాలపర్తి వీర్రాజు, యలనాటి మల్లేశ్వరరావు, పాలపర్తి బాబ్జి, తటవర్తి వరహాలు, వెదురుపల్లి సుబ్రహ్మణ్యం, జ్యోతుల సీతారాంబాబు, మేడిబోయిన హరికృష్ణ, జ్యోతుల శివ తదితరులు పాల్గొన్నారు.

  • కొత్తూరు కనకదుర్గమ్మ ఆలయము నందు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న జ్యోతుల

పత్తిపాడు నియోజవర్గం: శంఖవరం మండలం, కత్తిపూడి కొత్తూరు గ్రామంలో గల రావి చెట్టు వద్దనున్న కనకదుర్గమ్మ ఆలయం నందు దేవీనవరాత్రుల అనంతరం సోమవారం మహా అన్నదానకార్యక్రమం జరిగింది. కనకదుర్గమ్మ ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు పిఠాపురం జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు కత్తిపూడి కొత్తూరు రావిచెట్టు వద్ద గల కనకదుర్గ ఆలయం నందు జరుగుతున్న మహాఅన్నదానకార్యక్రమానికి హాజరై ముందుగా కనకదుర్గమ్మ ఆలయం నందు అమ్మవారిని దర్శించుకుని, అనంతరం మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయకమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు గౌతు నాగు, ఇంధన సత్తివీర్రాజు, అడపా సత్తిబాబు, గౌతు అర్జుబాబు, జ్యోతుల సీతారాంబాబు, మేడిపోయిన హరికృష్ణ, జ్యోతుల శివ తదితరులున్నారు.