ముఖ్యమంత్రిపై రాందాస్ చౌదరి ధ్వజం

మదనపల్లె, రాయచోటి, పీలేరు, లక్కిరెడ్డిపల్లి పరిసర ప్రాంతాల్లో ఈ సంవత్సరం వేరుశనగ పంట వర్షాలు లేక చాలా వరకు రైతన్నలు నష్టపోయారని ఒక ఎకరాకి సుమారుగా 25 వేల రూపాయలు ఖర్చు వస్తుందని ఒక ఎకరాకి 10 నుంచి 15 వరకు బస్తాలు వేరుశనక్కాయలు రైతన్నకి అందితే కొంతమేరకు లాభసాటి ఉంటుంది. అలాగే మొన్న జరిగిన నీటిపారుదల రంగంలో అంతర్జాతీయ సదస్సులో మన తుగ్లక్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ రంగం గురించి 10 నిముషాలు కూడా మాట్లాడలేని దౌర్భాగ్య నిస్సహాయ తెలివి తక్కువ ముఖ్యమంత్రి మనకు దొరకడం మన దురదృష్టకరం. వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రాష్ట్రంలో 448 కరువు మండలాలు ఉన్నాయని సాంకేతిక నిపుణులు తెలియజేస్తే కానీ వ్యవసాయ శాఖ మంత్రి 110 మండలాలు మాత్రమే కరువులో ఉన్నాయని చెప్పడం నిజంగా చాలా దురదృష్టకరమని అన్నారు. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వానికి గత నవంబర్ లో 550 కోట్లు ఇస్తే వ్యవసాయ రంగానికి కానీ, త్రాగునీరుకోసం కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం దౌర్భాగ్య స్థితిలో ఉందని తెలియజేశారు. ఈ రాష్ట్ర ప్రజలు 151 సీట్లు తుగ్లక్ ముఖ్యమంత్రికి ఇస్తే ఇసుకలో స్కాం, మద్యంలో స్కాం కనిజాల్లో స్కాం, ఉద్యోగాల్లో స్కాం ప్రతి దాంట్లో స్కాం అయి చివరికి బీహార్ లో 1985 -1995 మధ్య కాలంలో లాలు ప్రసాద్ యాదవ్ దాదాపు 930 కోట్లు పశువుల గడ్డిని మేస్తే ఈ ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రంలో దాదాపు 4 లక్షలకు పైన పాడావులని బీహార్ లో కొని స్వయం ఉపాధి సంఘాలకి అందచేసి దాదాపు 20 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరిగిందని శిశు సంక్షేమ శాఖ మంత్రి చెప్పడం జరిగింది. కానీ 4 లక్షల ఆవులని ఎంత మేరకు పంపిణీ చేశారని శ్వేతపత్రం రిలీజ్ చేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి అన్నారు.