ఏపీలో ప్రారంభమైన మూడోదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్

ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈరోజు మూడోదశ పంచాయతీ ఎన్నికలు జరగుతున్నాయి. ఉదయం 6:30 గంటల నుంచే ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయ్యింది. మధ్యాహ్నం 3:30 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మావోయిస్టు సమస్యాత్మక ప్రాంతాల్లో మధ్యాహ్నం 1:30 గంటల వరకే పోలింగ్ జరుగుతుంది. ఇక సాయంత్రం 4 గంటల నుంచి ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు, ఫలితాలు ఉంటాయి. మొత్తం 13 జిల్లాల్లోని 20 రెవిన్యూ డివిజన్లు, 160 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 2639 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇందులో 579 పంచాయతీలు, 11,753 వార్డులు ఏకగ్రీవం కావడం విశేషం.