దీపాంక్షకు ‘నృత్య శిఖామణి’ బిరుదు ప్రధానం

విశాఖపట్నం, గిలకంశెట్టి గిరీష్, వైశాలి దంపతుల గారాల పట్టి దీపాంక్ష కూచిపూడి నృత్యరంగ ప్రవేశ కార్యక్రమం కళాభారతి ఆడిటోరియం, విశాఖపట్నం నందు కళాభిమానులను అలరించింది. శ్రీ అంబికేశ్వర డాన్స్ & మ్యూజిక్ అకాడమీ తరుపున గురువు విజయ భరణి శంకర్, గురువు ఉదయ్ శంకర్, గురువు శ్రీమతి చేతనా శంకర్ చేతుల మీదుగా ‘నృత్య శిఖామణి’ బిరుదు ప్రధానం జరిగింది. గేమ్ గణపతి, నటరాజ స్తుతి, భామాకలాపం, గోవిందా గిరిధారి, రారా వేణు గోపాల, మనరా, తిలన, రామచంద్రాయ నృత్య కళారీతులు ఆహుతులను అలరించాయి. దీపాంక్ష కూచిపూడి నాట్యాన్ని అనుసరిస్తూ సోదరుడు గిలకంశెట్టి శ్రీనివాసు, సౌజన్యల కుమారుడు గగన్ ఫ్లూట్ మెలోడీక్ ట్యూన్ వీనుల విందు చేసింది. ఈ కార్యక్రమానికి ట్రాయ్ టీం, భాస్కర్ కొండేటి, కిరణ్ కుమార్ బావిశెట్టి, మాచాబత్తుని సాయి, సూర్య ప్రకాష్ పోలిశెట్టి, సుబ్బు విశ్వనాథం, కొమిరిశెట్టి నాని, పతివాడ విద్యాసాగర్ అభినందనలు తెలియజేశారు. మీరు ప్రపంచంలోని శిఖరాలను చేరుకోవాలని బలంగా కోరుకుంటున్నామని తెలియజేశారు.