కరోనా న్యూస్ బులెటిన్: తెలంగాణ

తెలంగాణలో గత 24 గంటల్లో 2256 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 77,513కి చేరింది. కరోనాతో కోలుకొని ఇప్పటి వరకు 54,330 మంది డిశ్చార్జు కాగా 615 మంది మరణించారు. గత 24 గంటల్లో 14 మంది మరణించారు. ప్రస్తుతం 22,568 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. 15,830 మంది హోం ఐసోలేషన్ లో ఉన్నారు.