నంద్యాల సబ్‌కలెక్టర్‌గా కల్పన కుమారిని నియమిస్తూ.. ఉత్తర్వులు జారీ

2018 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన కల్పన కుమారిని నంద్యాల డివిజన్ పరిధిలోని నంద్యాలలో సబ్‌ కలెక్టర్‌గా నియమిస్తూ.. శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈమె నెల్లూరు జిల్లాలో శిక్షణ పొందారు. తొలుత గూడూరు డివిజన్‌ కోట మండల తహసీల్దార్‌గా పని చేశారు. తరువాత అదే డివిజన్‌ పరిధిలోని చల్లకూరు మండలంలో జరిగిన ఉపాధి హామీ పనుల అవకతవకలపై ప్రత్యేక అధికారిణిగా విచారణ చేపట్టి తనదైన ముద్ర వేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నెల్లూరు కేంద్రంలోని కొవిడ్‌ కేంద్రానికి ప్రత్యేక అధికారిణిగా విధులు విజయవంతంగా నిర్వహించారు.